ప్రతి మిలియన్‌లో లక్షన్నర మందికి టెస్టులు

ABN , First Publish Date - 2020-12-03T07:22:57+05:30 IST

తెలంగాణలో ప్రతి పది లక్షల (మిలియన్‌) మందిలో లక్షన్నర మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అంటే ప్రతి పది మందిలో ఒకటిన్నర

ప్రతి మిలియన్‌లో లక్షన్నర మందికి టెస్టులు

మరో 565 పాజిటివ్‌లు.. 2.70 లక్షలకు చేరిన కేసులు

హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రతి పది లక్షల (మిలియన్‌) మందిలో లక్షన్నర మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అంటే ప్రతి పది మందిలో ఒకటిన్నర మందికి కొవిడ్‌-19 టెస్టు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 55.51 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు.

మంగళవారం తెలంగాణవ్యాప్తంగా 51,562 టెస్టులు చేయగా, అందులో కొత్తగా 565 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 2,70,883కు పెరిగింది. ఇన్ఫెక్షన్‌తో ఒకరు మృతిచెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,462కు చేరింది.


ప్రస్తుతం 9,266 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరో 925 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,60,155కు చేరింది.


Updated Date - 2020-12-03T07:22:57+05:30 IST