35 మందికి పరీక్ష.. 15 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-01T07:32:48+05:30 IST
35 మందికి పరీక్ష.. 15 మందికి పాజిటివ్

జగిత్యాల: జిల్లాలోని మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం 35 మందికి పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఒకరు మున్సిపల్ కౌన్సిలర్. ఓ వ్యాపారి కుటుంబ సభ్యుల్లో ఐదుగురికి వైరస్ సోకింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాలలో చేసిన పరీక్షల్లో 30 మందికి పాజిటివ్ వచ్చింది. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో పరీక్షల నిర్వహణలో నిబంధనలతో అనుమానితులు ఇబ్బంది పడుతున్నారు. ముందుగా వచ్చి పేరు నమోదు చేయించుకుంటే ఐడీ నంబర్ కేటాయించి, వారి వివరాలను హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి అనుమతి వచ్చాక పరీక్షలు చేస్తున్నారు. దీంతో గంటలు వేచి చూడాల్సి వస్తోంది.
8 సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన నాలుగు కుటుంబాల్లోని 19 మందికి పాజిటివ్‌గా తేలింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అత్త వారం క్రితం మరణించింది. నాలుగైదు రోజులకు ఆ వ్యక్తి భార్య, మరో ఐదు రోజులకు వదిన మరణించారు. వరుస మరణాలపై అనుమానంతో అంత్యక్రియల్లో పాల్గొన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 19 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వీరంతా హైదరాబాద్‌లో క్వారంటైన్‌కు వెళ్లారు.