మేము ఏం పాపం చేశాం?: ట్రెసా

ABN , First Publish Date - 2020-04-21T08:34:27+05:30 IST

‘‘మేము ఏం పాపం చేశామని మా సేవల్ని గుర్తించడం లేదు. విపత్కర సమయంలో రేయింబవళ్లు పని ..

మేము ఏం పాపం చేశాం?: ట్రెసా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘మేము ఏం పాపం చేశామని మా సేవల్ని గుర్తించడం లేదు. విపత్కర సమయంలో రేయింబవళ్లు పని చేస్తున్నందుకేనా వేతనాల్లో 50ు కోతలు?’’ అని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌(ట్రెసా) అధ్యక్షుడు వి.రవీంద్‌రెడ్డి, కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం వారు సీసీఎల్‌ఏలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులందరూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారన్నారు.


రెవెన్యూశాఖ పని తీరును ప్రభుత్వం గుర్తించకపోవడం, సీఎం కేసీఆర్‌కు సీఎస్‌ సైతం వివరించకపోవడం బాధాకరమని అన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) నుంచి డిప్యూటీ కలెక్టర్‌ దాకా అందరికీ పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ ఉద్యోగులందరికీ పూర్తి జీతాలివ్వాలని చెబుతూనే.. ప్రభుత్వోద్యోగులకు 50ు కోత పెట్టాలన్న నిర్ణయం సర్కారు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం(ఆల్‌మేవా) మండిపడింది. 

Updated Date - 2020-04-21T08:34:27+05:30 IST