పసుపు మార్కెటింగ్‌లో కేంద్రం విఫలం

ABN , First Publish Date - 2020-03-13T02:22:09+05:30 IST

అనాదిగా ఔషధ గుణాలున్న పసుపును ప్రపంచవ్యాప్తం చేయకపోవడం కేంద్ర అసమర్ధతకు నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

పసుపు మార్కెటింగ్‌లో కేంద్రం విఫలం

హైదరాబాద్‌: అనాదిగా ఔషధ గుణాలున్న పసుపును ప్రపంచవ్యాప్తం చేయకపోవడం కేంద్ర అసమర్ధతకు నిదర్శనమని  వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అలెప్సీ పసుపుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, అదే రకాన్ని ఇక్కడి రైతులకు అందించి సాగులో మెళకువలు అందించామన్నారు. నాణ్యతను పెంచడంతో పాటు ఎగుమతుల మీద దృష్టిసారించాలని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పసుపు నాణ్యత పెంపు , మార్కెటింగ్‌, వినియోగం , దీర్ఘకాలిక ప్రణాళిక, పద్దతులపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రోడ్డు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అన్‌పాలిష్ట్‌లో పసుపుతో రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. పండించిన పంటను ఉడికించి ఎండబెట్టి మార్కెట్‌కు తెస్తున్నారు. 900 సంవత్సరాలుగా పసుపు సాగును సాంప్రదాయంగా సాగు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వమే పసుపును తీసుకుని ప్రాసెసింగ్‌ చేసే అవకాశాల మీద దృష్టిసారించాలన్నారు. పసుపులో కర్క్‌మెన్‌శాతం పెంచితే ఎగుమతులు పెరిగి మద్దతు ధర లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పసుపులో సిండికేట్‌ దోపిడీ ఉందన్నారు. పీపీపీ మోడ్‌లో పసుపు ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. పతంజలి లాంటి సంస్థలకు వసతులు కల్పిస్తే మన పసుపును పూర్తిగా వారే కొంటారేమో ప్రయత్నాలు చేయాలన్నారు. పసుపు వినియోగం పెంచే అవకాశాలు, నాణ్యమైన పసుపు వంగడాలు రైతులకు అందించి దిగుబడి పెంచేందుకు ప్రయత్నించాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో పసుపు విషయంలో రైతులకు ఏం చేయగలమనే విషయంపై ఒక కమిటీని నియమించి నివేదిక వచ్చిన తర్వాత చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్థామన్నారు. 

Updated Date - 2020-03-13T02:22:09+05:30 IST