పదోతరగతి గ్రేడింగ్‌ కేటాయింపు ప్రారంభం

ABN , First Publish Date - 2020-06-16T10:01:54+05:30 IST

వందశాతం ఉత్తీర్ణత సాధించిన పదోతరగతి విద్యార్థుల గ్రేడింగ్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.

పదోతరగతి గ్రేడింగ్‌ కేటాయింపు ప్రారంభం

వందశాతం ఉత్తీర్ణత సాధించిన పదోతరగతి విద్యార్థుల గ్రేడింగ్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌(ఎ్‌ఫఏ) మార్కుల ఆధారంగా ఉత్తీర్ణత చేయాలని ఈనెల 8న సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు సాధించిన నాలుగు ఎఫ్‌ఏ మార్కుల పునఃపరిశీలన ప్రక్రియ 4 రోజుల పాటు సాగింది. సోమవారం నుంచి గ్రేడింగ్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. కరోనా నేపథ్యంలో సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడంతో ఈ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. వారం రోజుల్లో అంతా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Updated Date - 2020-06-16T10:01:54+05:30 IST