దగ్గు, జలుబు, జ్వరం ఉన్న విద్యార్థులకు..

ABN , First Publish Date - 2020-03-18T11:29:48+05:30 IST

పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న...

దగ్గు, జలుబు, జ్వరం ఉన్న విద్యార్థులకు..

  • ప్రత్యేక గదిలో టెన్త్‌ పరీక్ష
  • అన్ని పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్లు, సబ్బులు 
  • మాస్కులు, వాటర్‌ బాటిళ్లకు అనుమతి 
  • మంత్రి సబిత సమీక్ష.. రేపటి నుంచి పరీక్షలు


హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రత్యేక గదిలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్లు, సబ్బులను అందుబాటులో ఉంచనున్నట్లు, విద్యార్థులు మాస్కులతో రావొచ్చని, వాటర్‌ బాటిళ్లను కూడా అనుమతిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు గురువారం ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏదైనా సమస్య తలెత్తితే 040-23230942 నంబరుకు ఫోన్‌ చేయాలన్నారు.

Updated Date - 2020-03-18T11:29:48+05:30 IST