నల్గొండ జిల్లాలో పోలీసుల దెబ్బలకు వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2020-10-17T22:27:22+05:30 IST

పోలీసులు మానవత్వానికి మచ్చ తెస్తున్నారు. అధికార బలంతో అమాయకులపై లాఠీ రుజుపిస్తున్నారు. అడవిదేవులపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సక్రి సక్రి(55) అనే వృద్ధురాలిపై పోలీసులు దాడి చేశారు. పోలీసుల దెబ్బలకు వృద్ధురాలు మృతి చెందింది.

నల్గొండ జిల్లాలో పోలీసుల దెబ్బలకు వృద్ధురాలు మృతి

నల్గొండ: అడవిదేవులపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సక్రి(55) అనే వృద్ధురాలిపై పోలీసులు దాడి చేశారు. పోలీసుల దెబ్బలకు వృద్ధురాలు మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులు తీరుపై మండిపడ్డారు. మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాధితులు ఆందోళనకు దిగడంతో పోలీస్‌స్టేషన్‌‌కు తలుపులు వేసుకుని పోలీసులు పరారయ్యారు. పోలీసులకు వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని వృద్ధురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నాధికారులను ఆశ్రయిస్తామని చెబుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులు అధికారులు స్పందించలేదు.

Updated Date - 2020-10-17T22:27:22+05:30 IST