‘పాలమూరు-రంగారెడ్డి’లో మిగిలిన పనులకు టెండర్లు
ABN , First Publish Date - 2020-05-09T10:47:33+05:30 IST
‘పాలమూరు-రంగారెడ్డి’లో మిగిలిన పనులకు టెండర్లు
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన పనులకు కూడా టెండర్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంజనీర్లు టెండర్ల నోటిఫికేషన్‌కు సంబంధించిన చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో పలు పనులను ఇప్పటికే ప్రారంభించగా.. ఉద్దండపూర్ నుంచి కేపీ లక్షీదేవిపల్లి వరకు గల 4 ప్యాకేజీల పనుల కోసం ఇప్పటి వరకు టెండర్లను ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో ఈ పనుల కోసం టెండర్లను పిలవాల్సిందిగా ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు ఇంజనీర్లకు సూచించారు. ఇందులో (ప్యాకేజీ 19, 20, 21) రిజర్వాయర్, పంప్‌హౌజ్, టన్నెల్, ఓపెన్ కెనాల్ వంటి పనులు ఉండగా.. గతంలో వీటి విలువ రూ.4300 కోట్లు ఉండేది. తాజా ఎస్‌ఎ్‌సఆర్ ధరల ప్రకారం ఈ పనుల అంచనా విలువ సుమారు రూ.7 వేల కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. వ్యయాన్ని సవరించి, టెండర్లను ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్యాకేజి-9లోని పనుల అంచనా వ్యయాన్ని రూ.911.32 నుంచి రూ. 996 కోట్లకు పెంచారు.