హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రెయిన్ డీపీఆర్‌కు టెండర్లు
ABN , First Publish Date - 2020-11-03T08:18:34+05:30 IST
హైదరాబాద్-పుణె-ముంబై మధ్య ప్రారంభించబోయే బుల్లెట్ ట్రెయిన్ డీపీఆర్ తయారీ బిడ్లను ఈ నెల
18న తెరచుకోనున్న బిడ్లు, 5న ప్రీబిడ్ భేటీ
బుల్లెట్ ట్రెయిన్‌తో 3.50 గంటల్లోనే ముంబైకి..
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-పుణె-ముంబై మధ్య ప్రారంభించబోయే బుల్లెట్ ట్రెయిన్ డీపీఆర్ తయారీ బిడ్లను ఈ నెల 18న తెరవనున్నారు. ప్రీబిడ్ సమావేశం ఈ నెల 5న జరగనుంది. రైల్వే బోర్డు ఆదేశానుసారం ఈ డీపీఆర్ తయారీకి నేషనల్ హై స్పీడ్ రెయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) టెండర్లను ఆహ్వానించింది.
గంటకు 320కిలో మీటర్ల వేగంతో పరుగెత్తే బుల్లెట్ ట్రెయిన్లను ఏడు కారిడార్లలో ప్రారంభించాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడింటికి ఎన్‌హెచ్‌ఎస్‌సీఆర్‌సీఎల్ డీపీఆర్‌లను తయారు చేయించనుంది. ఇందులో 711 కిలో మీటర్ల హైదరాబాద్-పుణె-ముంబై కారిడార్ ఒకటి. బుల్లెట్ ట్రెయిన్‌తో హైదరాబాద్-ముంబై మధ్య 3.50 గంటల్లోనే ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం సగటున 80 నుంచి 120 కిలో మీటర్ల వేగంతో వెళుతున్న రైళ్లలో హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించాలంటే 13 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ ట్రెయిన్‌తో ఏకంగా 9.50 గంటల సమయం తగ్గుతుంది.