కెనడాలో తెలుగు యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-15T15:53:35+05:30 IST
కెనడాలో తెలుగు యువకుడు ప్రణయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్: కెనడాలో తెలుగు యువకుడు ప్రణయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలు మోసం చేసిందని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో పాటు మరో ఆరుగురు యువకులను మోసం చేసిందంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. సిగరెట్లు తాగుతూ తనను కూడా స్మోక్ చేయాలని బలవంతం పెట్టిందన్నాడు. చివరికి హెచ్1 వీసా రాగానే తనకు తెలియకుండా మోసం చేసి వెళ్లిపోయిందని ప్రణయ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
తనతో సహజీవనం చేస్తూనే మాజీ ప్రియుడితో చాట్ చేసేదని, చాటింగ్ చేయవద్దని చెప్పినందుకు తరుచూ గొడవ పడేదని ప్రణయ్ ఆ లెటర్‌లో తెలిపాడు. మద్యం, సిగరెట్లు కాల్చుతూ ఉండేదని, ఇలాంటి పనులు వద్దని చెప్పినందుకే తనను మోసం చేసిందని.. దీంతో తీవ్ర మస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రణయ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తన గురించి ఎవరూ భాద పడవద్దని, తన అవయవాలు దానం చేయాలని, తన శరీరాన్ని కూడా పరిశోధనల్లో వాడేలా చూడాలంటూ ప్రణయ్ తల్లి దండ్రులకు లేఖ రాశాడు.