2 రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2020-05-09T13:59:56+05:30 IST

రాగల రెండు రోజుల్లో (శని,ఆదివారం) రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40కి.మీ) తేలికపాటి ..

2 రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): రాగల రెండు రోజుల్లో (శని,ఆదివారం) రాష్ట్రంలో  అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40కి.మీ) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం అక్కడక్కడ వడగండ్లు కూడా పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అక్కడక్కడ  ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  కురిశాయి. రాగల మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 42 నుంచి 44 డిగ్రీలు నమోదవవచ్చని తెలిపారు.

Updated Date - 2020-05-09T13:59:56+05:30 IST