తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ నిరసన

ABN , First Publish Date - 2020-09-18T20:04:08+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ట్యాంక్ బండ్ అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీటీడీపీ తెలుగు మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ నిరసన

హైదరాబాద్: తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ట్యాంక్ బండ్ అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీటీడీపీ తెలుగు మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న, పలువురు మహిళలు పాల్గొన్నారు. మహిళ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ అంబేద్కర్‌ విగ్రాహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జ్యోత్స్న ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడిచినా మహిళా కమిషన్ లేకపోవటం అన్యాయమన్నారు. మహిళలపై సీఎం కేసీఆర్‌కు చిన్నచూపు తగదన్నారు. ప్రభుత్వం మహిళా కమిషన్ ఏర్పాటు చేసే వరకూ పోరాటం సాగిస్తామని జ్యోత్స్న తెలిపారు. 

Updated Date - 2020-09-18T20:04:08+05:30 IST