సరిహద్దులు దాటుతున్న మద్యం

ABN , First Publish Date - 2020-05-11T10:04:22+05:30 IST

తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి మద్యం అక్రమ రవాణా జోరందుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అన్నవరం ...

సరిహద్దులు దాటుతున్న మద్యం

  • తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి అక్రమంగా తరలింపు
  • చెక్‌పోస్టుల వద్ద భారీగా బాటిళ్లు స్వాధీనం

జగ్గయ్యపేట రూరల్‌, నందిగామ రూరల్‌: మే 10: తెలంగాణ  నుంచి ఆంధ్రాలోకి మద్యం అక్రమ రవాణా జోరందుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామ చెక్‌పోస్టు వద్ద ఆదివారం భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వత్సవాయి మండ లం భీమవరం గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు గ్రామ వలంటీర్‌. అలాగే, వేర్వేరు కేసుల్లో 211 మద్యం సీసాలు, నాలుగు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు మండల కాకర్ల శివారు వెంసూ రు అడ్డరోడ్డులోని తెలంగాణ చెక్‌పోస్టు వద్ద కూడా పలు మద్యం బాటిళ్లను ఆ రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొవిడ్‌-19 విధులను పోలిన స్టిక్కర్‌ ఉన్న కారు తెలంగాణలోని సత్తుపల్లి నుంచి నూజివీడు రోడ్డులోని వెంసూరు అడ్డరోడ్డు చెక్‌పోస్టు దాటి తిరువూరు మండలంలోకి ప్రవేశిస్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో తెలంగాణకు చెందిన మద్యం బాటిళ్లు ఉండటంతో, కారుతో పాటు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద 204 మద్యం సీసాలు, పల్లెంపల్లి చెక్‌పోస్టు వద్ద మరో 43 మద్యం సీసాలను  స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-05-11T10:04:22+05:30 IST