దుబ్బాకలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమన్న టీడీపీ అధినేత

ABN , First Publish Date - 2020-10-19T22:23:52+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు 2018 అసెంబ్లీ ఎన్నికకే పరిమితమని చెప్పారు. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ పోటీ చేస్తుందని

దుబ్బాకలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమన్న టీడీపీ అధినేత

హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు 2018 అసెంబ్లీ ఎన్నికకే పరిమితమని చెప్పారు. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ పోటీ చేస్తుందని పేర్కొన్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించి ఎన్నికల ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు. తన సమర్థతపై నమ్మకం‌ ఉంది కాబట్టే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మళ్లీ చంద్రబాబు అవకాశమిచ్చారని తెలిపారు. తనకంటే బాగుగా పార్టీని సమర్థవంతంగా నడిపేవారుంటే బాధత్యలు అప్పజెప్పమని చంద్రబాబును కోరినట్లు చెప్పుకొచ్చారు. పార్టీలో అసంతృప్తులు సహజం.. అందర్నీ కలుపుకుని ముందుకెళ్లనున్నట్లు ఏబీఎన్‌తో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు.

Updated Date - 2020-10-19T22:23:52+05:30 IST