లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ..
ABN , First Publish Date - 2020-05-09T14:10:57+05:30 IST
గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు భౌతిక దూరం పాటించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
ఖమ్మం, (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగే ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు భౌతిక దూరం పాటించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మంలో పోలీసుల ఆధ్వర్యంలో 1000మంది ఆటోడ్రైవర్లకు నిత్యావసరాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.