తెలంగాణలో వరి సేకరణపై పొలిటికల్ వార్...LIVE

ABN , First Publish Date - 2020-04-24T12:54:11+05:30 IST

తెలంగాణలో వరి సేకరణపై పొలిటికల్ వార్...LIVE

తెలంగాణలో వరి సేకరణపై పొలిటికల్ వార్...LIVE

హైదరాబాద్: తెలంగాణలో వరి సేకరణపై పొలిటికల్ వార్ నడుస్తోంది. రైతుల పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటామని ప్రభుత్వం చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అంటున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం నిరాహార దీక్ష చేయనున్నట్లు బండిసంజయ్ ప్రకటించారు. అయితే బండి సంజయ్ దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నేత పళ్లారాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. దమ్ముంటే వ్యవసాయానికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై అధికారులు వేధిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో రైతులు నిరసనలకు దిగారు. ప్రభుత్వ అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తమ ధాన్యాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టుకున్నారు. రాష్ట్రంలో వరి సేకరణ, ధాన్యం కేంద్రాల వద్ద రైతుల సమస్యపై మార్నింగ్‌లో చర్చిద్దాం...ఈ చర్చలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. చర్చను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి.


Updated Date - 2020-04-24T12:54:11+05:30 IST