తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం..!
ABN , First Publish Date - 2020-10-07T11:18:55+05:30 IST
ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా

హైదరాబాద్: ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా ప్రయాణించి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దక్షిణ కోస్తా ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మంగళవారం మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.