తెలంగాణలో నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-01T13:14:27+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆన్‌‌లైన్ తరగతులను నిర్వహించనున్నారు. దూరదర్శన్, యాదగిరి, టీశాట్ ఛానెళ్లలో తరగతుల వారీగా

తెలంగాణలో నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆన్‌‌లైన్ తరగతులను నిర్వహించనున్నారు. దూరదర్శన్, యాదగిరి, టీశాట్ ఛానెళ్లలో తరగతుల వారీగా పాఠ్యాంశాలను బోధించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. తొలిరోజు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రెండు సబ్జెక్టుల చొప్పున క్లాస్‌లు ప్రసారం చేయనున్నారు.

Updated Date - 2020-09-01T13:14:27+05:30 IST