వైద్యం చేయించి, స్వదేశానికి రప్పించండి

ABN , First Publish Date - 2020-05-10T09:18:47+05:30 IST

బతుకుదెరువు కోసం మస్కట్‌ వెళ్లిన అభాగ్యుడు అనారోగ్యం బారిన పడి, వైద్య సహాయం అందక వారం రోజులుగా ఓ గదిలో బందీగా కాలం గడుపుతున్నాడు.

వైద్యం చేయించి, స్వదేశానికి రప్పించండి

కేటీఆర్‌, హరీశ్‌కు తెలంగాణ వాసి విజ్ఞప్తి 


దుబ్బాక, మే 9: బతుకుదెరువు కోసం మస్కట్‌ వెళ్లిన అభాగ్యుడు అనారోగ్యం బారిన పడి, వైద్య సహాయం అందక వారం రోజులుగా ఓ గదిలో బందీగా కాలం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు వైద్యం చేయించి, స్వదేశానికి రప్పించాలని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ము నిసిపాలిటీ పరిధిలోని దర్మాజీపేటకు చెందిన దివిటి రమేశ్‌ (38) శనివారం మస్కట్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’తో తన గోడు వెళ్లబోసుకున్నాడు. మస్కట్‌లోని ఓ కంపెనీలో నాలుగేళ్లుగా పని చేస్తున్న తాను వారం రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పాడు. కంపెనీ యాజమాన్యం ప్రాథమిక చికిత్స చేయించి, మందులు ఇచ్చి చేతులు దులుపుకున్నదని, తనను ఓ గదిలోనే బందీగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భర్తకు వైద్యం అందించి, స్వదేశానికి రప్పించాలని రమేశ్‌ భార్య యాదమ్మ మంత్రులు, ఎంపీకి విజ్ఞప్తి చేసింది. 

Updated Date - 2020-05-10T09:18:47+05:30 IST