హైదరాబాద్: క్వారంటైన్ స్టాంప్‌తో యువకుడు రోడ్లపై తిరుగడంతో..
ABN , First Publish Date - 2020-03-24T02:43:11+05:30 IST
విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, కరోనా లక్షాణాలున్న వారు 14 రోజులపాటు ఇంటికే పరిమితం కావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ : విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, కరోనా లక్షాణాలున్న వారు 14 రోజులపాటు ఇంటికే పరిమితం కావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే క్వారంటైన్ స్టాంప్ ఉన్నవారు ఇంటికే పరిమితం కాకుండా బయట తిరుగుతుండటంతో జనాలు జంకుతున్నారు.
వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లో క్వారంటైన్ స్టాంప్ ఉన్న యువకుడు రోడ్లపై తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ యువకుడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల సింగపూర్ నుంచి నగరంలోని బోయిన్‌పల్లి రాజరాజేశ్వరనగర్‌కు యువకుడు వచ్చాడు. కొద్దిరోజులుగా క్వారంటైన్‌లో ఉన్న అతను ఇవాళ సాయంత్రం బయట తిరిగాడు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ సర్కార్ హెచ్చరించింది.