రూ. 20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్లను చెల్లించేందుకు అనుమతించండి
ABN , First Publish Date - 2020-10-01T08:45:16+05:30 IST
అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు బకాయిలు చెల్లించేందుకు అనుమతించాలని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలంగాణ హైకోర్టును బుధవారం కోరారు. అగ్రిగోల్డ్ గ్రూపు సంస్థల....
తెలంగాణ హైకోర్టును కోరిన ఏపీ
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు బకాయిలు చెల్లించేందుకు అనుమతించాలని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలంగాణ హైకోర్టును బుధవారం కోరారు. అగ్రిగోల్డ్ గ్రూపు సంస్థల కుంభకోణంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ చేయాలన్నారు. అగ్రిగోల్డ్ స్థిరాస్థులను వేలం ద్వారా విక్రయించేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతించిందని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టును ఏజీ కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వ్యాజ్యాలను భౌతిక కోర్టుల్లో ప్రత్యక్షంగా విచారిస్తామని పేర్కొంది. విచారణను నవంబరు 4కి వాయిదా వేసింది.