ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-12-17T19:09:25+05:30 IST
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆస్తుల నమోదుపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ వేసింది. స్లాట్ బుకింగ్ కోసం 29 పేజీల వివరాలు అడుగుతున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్‌కు 29 పేజీల వివరాలు అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది. స్లాట్ బుకింగ్ పేరుతో వ్యక్తిగత వివరాలు తీసుకుంటున్నారని హైకోర్టు తెలిపింది. కుటుంబ సభ్యుల, సాక్షుల ఆధార్ కార్డ్ వివరాలు, వారి ఫోన్ నెంబర్లు ఎందుకుని కోర్టు ప్రశ్నించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ ప్రస్తావనే రావొద్దని హైకోర్టు పేర్కొంది.