తెలంగాణలో కరోనా కేసులపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-11-19T20:45:45+05:30 IST

తెలంగాణలో కరోనా కేసులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

తెలంగాణలో కరోనా కేసులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా టెస్ట్‌లు తక్కువ జరుగుతున్నాయని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులో కేసు ఉన్నప్పుడే టెస్టులు పెంచి.. తర్వాత తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రోజుకు లక్ష వరకు టెస్టులు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తెలంగాణలో రెండో దశ కరోనా ముప్పు పొంచి ఉందని, కరోనా మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.


అధిక బిల్లులు వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై.. ఏం చర్యలు తీసుకున్నారో హైకోర్టు తెలపాలంది. జిల్లా ఆస్పత్రుల్లో ఆర్‌టీపీసీఆర్ కిట్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. కరోనాపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు ఎందుకు సమర్పించడం లేదని హైకోర్టు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నెల 24లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ 26వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2020-11-19T20:45:45+05:30 IST