కరోనాపై తెలంగాణ హెల్త్ బులెటిన్ వచ్చేసింది.. సోమవారం ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-05-19T03:53:15+05:30 IST

తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ 1,592 మందికి కరోనా పాజిటివ్..,.

కరోనాపై తెలంగాణ హెల్త్ బులెటిన్ వచ్చేసింది.. సోమవారం ఒక్కరోజే..

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ 1,592 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. సోమవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 మందికి, మేడ్చల్‌ జిల్లాలో ముగ్గురికి, మరో 12 మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు తెలంగాణలో 69 మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. సోమవారం 10 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,002 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 556 మందికి చికిత్స  కొనసాగుతోంది. కరోనాతో ఇప్పటి వరకు 34 మంది చనిపోయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Updated Date - 2020-05-19T03:53:15+05:30 IST