‘జిమ్‌ ఇండస్ట్రీని ఆదుకోండి’

ABN , First Publish Date - 2020-06-06T17:22:01+05:30 IST

‘జిమ్‌ ఇండస్ట్రీని ఆదుకోండి’

‘జిమ్‌ ఇండస్ట్రీని ఆదుకోండి’

హైదరాబాద్: జిమ్‌లను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలంగాణ జిమ్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. శనివారం మీడియాతో మాట్లాడుతూ జిమ్‌ల ఓపెనింగ్‌కు కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి జిమ్‌లను నడి‌పిస్తామని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5 వేల జిమ్‌లు ఉన్నాయని.. 50 వేల మంది జిమ్ ట్రైనర్స్ పనిచేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు వెంటనే స్పందించి జిమ్ ఇండస్ట్రీనీ ఆదుకోవాలని కోరారు. తెలంగాణ జిమ్ ఓనర్స్ అసోసియేషన్‌కు సీరియల్ ఆర్టిస్టులు బిగ్ బాస్ ఫేమ్ అలీ రేజ, ఆర్టిస్టు విశ్వ మద్దతు ప్రకటించారు. 

Updated Date - 2020-06-06T17:22:01+05:30 IST