క్వారంటైన్‌లో ఉండని వారిపై టి.సర్కార్ కొరడా.. డీఎస్పీపై కేసు

ABN , First Publish Date - 2020-03-23T22:17:10+05:30 IST

విదేశాల నుంచి వచ్చిన క్వారంటైన్‌లో ఉండాలని తెలంగాణ సర్కార్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.

క్వారంటైన్‌లో ఉండని వారిపై టి.సర్కార్ కొరడా.. డీఎస్పీపై కేసు

హైదరాబాద్ : విదేశాల నుంచి వచ్చిన క్వారంటైన్‌లో ఉండాలని తెలంగాణ సర్కార్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. క్వారంటైన్‌లో ఉండని వారిపై కఠిన చర్యలు తప్పవని ఇదివరకే ప్రభుత్ం హెచ్చరించింది. అయితే.. విదేశాల నుంచి వచ్చిన కొందరు మాత్రం ఇష్టానుసారం బయట తిరిగేస్తున్నారు. క్వారంటైన్‌లో ఉండని వారిపై సోమవారం నాడు తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్- 1897 కింద 60 మందికి పైగా కేసులు నమోదు చేయడం జరిగింది.


ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని ఉల్లంఘించి ఇళ్ల నుంచి భయటికి వచ్చే వారిని ఉపేక్షించొద్దని ప్రభుత్వం నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.


డీఎస్పీపై కేసు

ఇదిలా ఉంటే.. క్వారంటైన్‌‌లో ఉండనందుకు కొత్తగూడెం డీఎస్పీపై అధికారులు కేసు నమోదు చేశారు. అయితే.. డీఎస్పీ కుమారుడు కరోనా పాజిటివ్ రావడంతో వైద్యం కోసం రాగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


కాగా.. ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రజలు ఎవరి ఇళ్లలో వారుండాలని.. క్వారంటైన్ స్టాంప్ వేసిన వారు కూడా బయట తిరుగుతున్నారని.. వాళ్లను బయటకు వెళ్లనివ్వొద్దని తలిదండ్రులకు ఇదిరకే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మాట పెడినచెవిన పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

Updated Date - 2020-03-23T22:17:10+05:30 IST