తెలంగాణ గవర్నర్‌ను కించపరిచేలా ఫొటో.. నటుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-03-15T15:33:18+05:30 IST

తెలంగాణా గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కించపరిచేలా ఫేస్‌బుక్‌ లో

తెలంగాణ గవర్నర్‌ను కించపరిచేలా ఫొటో.. నటుడి అరెస్ట్

చెన్నై : తెలంగాణా గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కించపరిచేలా ఫేస్‌బుక్‌ లో ఫొటో పెట్టిన తమిళ సినీ సహాయనటుడిని మన్నార్‌ గుడి పోలీసులు అరెస్టు చేశారు. తిరువారూరు జిల్లా మన్నార్‌గుడికి చెందిన సాదిక్‌ బాషా (39) ‘కలవాణి-2’ అనే తమిళ సినిమాలో సహాయనటుడిగా నటించారు. ప్రస్తుతం మరికొన్ని చిత్రాల లోనూ ఆయన నటిస్తున్నారు.


ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సాదిక్‌ బాషా తన ఫేస్‌బుక్‌లో తెలంగాణా గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ కీర్తి ప్రతిష్టలను భంగపరిచేలా ఆమె ఫొటో పెట్టా డు. దీనిపై బీజేపీ మన్నార్‌గుడి శాఖ నాయకుడు రఘు రామన్‌ ఫిర్యాదు మేరకు మన్నార్‌గుడి పోలీసులు కేసు నమోదు చేసుకుని సాదిక్‌బాషా ఆచూకీ కోసం గాలించారు. చివరకు తిరుత్తురైపూండి సమీపం కట్టిమేడులో ఉన్న సాదిక్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.

Updated Date - 2020-03-15T15:33:18+05:30 IST