కరోనాపై దిట్టుబాటు చర్యలు మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-07-18T17:00:26+05:30 IST

హైదరాబాద్: కరోనాపై దిద్దుబాటు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించింది. రెండు రోజుల క్రితం ముఖ్య అధికారులను బదిలీ చేసింది.

కరోనాపై దిట్టుబాటు చర్యలు మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: కరోనాపై దిద్దుబాటు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించింది. రెండు రోజుల క్రితం ముఖ్య అధికారులను బదిలీ చేసింది. ఈ రోజు మంత్రుల కమిటీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల కమిటీకీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ ఉండనున్నారు. సభ్యులుగా మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు మంత్రులు ఉండనున్నట్టు సమాచారం. రెండు రోజుల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పకడ్బందీ చర్యలపై నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-07-18T17:00:26+05:30 IST