కరోనా మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాచడం సరికాదు: కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-08-01T21:25:17+05:30 IST

కరోనా మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాచడం సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తపుబట్టారు. గాంధీ ఆస్పత్రిని కిషన్‌రెడ్డి సందర్శించారు.

కరోనా మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాచడం సరికాదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: కరోనా మరణాలను తెలంగాణ ప్రభుత్వం దాచడం సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తపుబట్టారు. గాంధీ ఆస్పత్రిని కిషన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. ఔట్‌సోర్సింగ్ వైద్యుల నియామకాలను పెంచాలన్నారు. కరోనా విజేతలు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్‌లో కరోనా తీవ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. టెస్టింగ్‌ సమయంలో తప్పుడు అడ్రస్‌ ఇస్తే చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి ఆదేశించారు.

Updated Date - 2020-08-01T21:25:17+05:30 IST