ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-05-13T21:37:49+05:30 IST

కృష్ణా బోర్డు ఇన్‌చార్జ్‌ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203పై ఫిర్యాదు చేశారు.

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

హైదరాబాద్: కృష్ణా బోర్డు ఇన్‌చార్జ్‌ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203పై ఫిర్యాదు చేశారు. ఏపీ కొత్త ప్రతిపాదనల వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై వివరణ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై ఫిర్యాదుపాటు న్యాయపరంగా పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు, రాలయసీమ లిప్టు ప్రాజెక్టు నిర్మాణాలు అక్రమమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. విభజన చట్టానికి విరుద్ధంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఏపీ పూనుకుంటోందని కృష్టా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల కారణంగా తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపింది.

Updated Date - 2020-05-13T21:37:49+05:30 IST