తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో మళ్లీ గందరగోళం

ABN , First Publish Date - 2020-10-07T23:14:27+05:30 IST

ఎంసెట్‌ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొది. ఈ సారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. దీంతో...

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో మళ్లీ గందరగోళం

హైదరాబాద్‌:  తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్‌ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు వచ్చినా.. ఇంటర్మీడియట్‌‌ అన్ని సబ్జెక్టుల్లో పాసైనా.. రిజల్ట్‌లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలి ఫైయింగ్ ఫలితం వస్తోంది. ఈ ఫలితాలను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు షాక్ అవుతున్నారు. అయితే పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించారు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. 


కాగా తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం నెలకొనడాన్ని ఏబీవీపీ నేత మురళి మనోహర్ ఖండించారు. విద్యారంగం ఒకటుందనే సోయ తెలంగాణ ప్రభుత్వానికి లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమని ఆయన ఆరోపించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఉన్నత విద్యాశాఖకు పూర్తి అధికారాలు లేకపోవడం కూడా ఒక ప్రధానమైన సమస్య అని ఆయన తెలిపారు.  ఇలాంటి గందరగోళ పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మురళి వ్యాఖ్యానించారు. 



Updated Date - 2020-10-07T23:14:27+05:30 IST