తెలంగాణ డీజీపీతో కేంద్రం బృందం సమావేశం

ABN , First Publish Date - 2020-04-26T16:52:42+05:30 IST

తెలంగాణ డీజీపీతో కేంద్రం బృందం సమావేశం

తెలంగాణ డీజీపీతో కేంద్రం బృందం సమావేశం

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డితో కేంద్ర బృందం డీజీపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు పోలీస్‌శాఖ చేస్తున్న సేవలను కేంద్ర బృందం సమీక్షించనుంది. అలాగే రాష్ట్రంలో లాక్‌డౌన్‌‌ను పటిష్టంగా అమలు చేయడంలో పోలీస్ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలపై బృందం ఆరా తీయనుంది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు తీసుకున్న చర్యలను తెలుసుకోనుంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యలు.. 100 డైల్ కాల్ చేస్తే పోలీస్ శాఖ స్పందించే తీరుపై కేంద్ర బృందం సభ్యులు ఆరా తీయనున్నారు.


మరోవైపు డీజీపీతో భేటీ అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కేంద్రం బృందం సమావేశం కానుంది. రాష్ట సరిహద్దుల్లో పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు...క్వారంటైన్ సెంటర్ల వద్ద బందోబస్తు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో బృందం సభ్యులు చర్చించనున్నారు. 

Updated Date - 2020-04-26T16:52:42+05:30 IST