కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు

ABN , First Publish Date - 2020-03-08T10:25:17+05:30 IST

జీఎస్టీ, ఇతర అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. కేసీఆర్‌ గట్టి నాయకుడు

కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు

పాత నగరం అభివృద్ధికి మరింత కృషి చేయాలి: అక్బరుద్దీన్‌

జీఎస్టీ, ఇతర అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. కేసీఆర్‌ గట్టి నాయకుడు కావడం వల్లనే కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని శాసన సభలో అభిప్రాయపడ్డారు. 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల ద్వారా రాష్ట్రం సుమారు రూ. 2,500 కోట్ల నిధులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.


కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ప్రత్యేక నిధులను ఇవ్వాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రం చిన్న చూపు చూస్తుందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, సీఏఏ, ఎన్నార్సీ లాంటి నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పాతనగరం అభివృద్దికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని అక్బరుద్దీన్‌ కోరారు.

Updated Date - 2020-03-08T10:25:17+05:30 IST