సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

ABN , First Publish Date - 2020-03-24T22:00:27+05:30 IST

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌  నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి  అండ‌గా ప‌లువురు త‌మ‌వంతు స‌హాయాన్ని అంద‌జేస్తున్నారు.  తాజాగా సీఎం  కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కలిశారు.  ఒకరోజు మూల వేతనాన్నిప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు  విరాళంగా అందించారు. కరోనా నియంత్రణకు సీఎం సహాయనిధికి రూ.48కోట్లు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కలిసి జేఏసీ నాయకులు రవీందర్‌రెడ్డి, మమత చెక్‌ అందించారు. అలాగే కరోనా నివారణ చర్యలకు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల సతీమణి భారీ విరాళం ప్రకటించారు.  సీఎం సహాయనిధికి సత్యనాదెళ్ల సతీమణి అనుపమ రూ.2కోట్ల విరాళం అందించారు.  హీరో నితిన్‌ పది లక్షల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్‌ అందించారు. 

Read more