ముల్కలపల్లిలో 5 నిమిషాలు ఆగి హామీ ఇచ్చిన కేసీఆర్
ABN , First Publish Date - 2020-11-01T01:34:45+05:30 IST
రైతు వేదికలను ప్రారంభించి ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ..

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ కొత్త చరిత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. రైతు వేదికలను ప్రారంభించి ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ లేదన్నారు. రైతు వేదికలు తన కలని.. ఈ వేదికలు రైతులను సంఘటిత శక్తిగా మారుస్తాయని తెలిపారు. త్వరలోనే భూ సమగ్ర సర్వే జరుగుతుందని, సంకల్పం గట్టిగా ఉంటే రైతు రాజ్యం వచ్చి తీరుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.
అనంతరం హైదరాబాద్ బయల్దేరిన సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో 5 నిమిషాల పాటు ఆగారు. భువనగిరి-గజ్వేల్ రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.