ఆర్థికమంత్రి ప్రకటించిన ప్యాకేజీ డొల్ల.. : భట్టి

ABN , First Publish Date - 2020-05-17T19:42:43+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థికమంత్రి ప్రకటించిన ప్యాకేజీ డొల్ల అని దీనివల్ల ఎవరికీ

ఆర్థికమంత్రి ప్రకటించిన ప్యాకేజీ డొల్ల.. : భట్టి

హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థికమంత్రి ప్రకటించిన ప్యాకేజీ డొల్ల అని దీనివల్ల ఎవరికీ లాభంలేదని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. విపక్షాలపై మండలి చైర్మన్‌ ఆరోపణలు సరికాదన్నారు. వలస కార్మికులు 40కోట్ల మంది ఉంటే 20కోట్ల మందేనని చూపారన్నారు.


చాయ్‌, ఆటో, రిక్షా కార్మికులకు నేరుగా ఏ ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. వస్తు ఉత్పత్తికి అనుమతిలేదు.. లోన్లు ఎవరికి ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపైనే దృష్టి పెట్టిందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతిన్నదని భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Updated Date - 2020-05-17T19:42:43+05:30 IST