కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2020-12-15T20:42:50+05:30 IST

తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమైంది. వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు విధివిధానాలు

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమైంది. వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు విధివిధానాలు, మార్గదర్శకాలను కమిటీ ఖరారు చేయనుంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ సమాశమైంది. ఈ భేటీకి మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరైనారు. 3 రోజుల పాటు బిల్డర్లు, రియల్టర్లతో సమావేశమై వారి అభిప్రాయాలను కమిటీ పరిగణనలోకి తీసుకోనుంది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 11 తేదీ నుంచి రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు. అయితే 14 తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కాకపోతే, తొలిరోజు కేవలం 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అత్యధికంగా ఉప్పల్‌లో 7 రిజిస్ట్రేషన్లు జరగగా.. కొన్నిచోట్ల ఒక్కటి కూడా జరగలేదు. స్లాట్ల బుకింగ్‌, సాంకేతిక సమస్యలే ఇందుకు కారణం. స్లాట్ల కోసం ప్రజలు నానా తిప్పలు పడ్డారు. పూర్తి సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Updated Date - 2020-12-15T20:42:50+05:30 IST