గుండెపోటుతో తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత మృతి

ABN , First Publish Date - 2020-12-27T12:57:38+05:30 IST

గుండెపోటుతో మృతి చెందారు.

గుండెపోటుతో తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత మృతి

కూకట్‌పల్లి/మియాపూర్‌ : బీజేపీ సీనియర్‌ నాయకుడు మాధవరం భీం రావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివేకానంద సేవా సమతి సభ్యులుగా పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. భారత్‌ వికాస్‌ ఫౌండేషన్‌లో కూడా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన వివేకానంద నగర్‌ కాలనీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భీమ్‌రావు మృతిపట్ల బీజేసీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు.

Updated Date - 2020-12-27T12:57:38+05:30 IST