తెలంగాణ నుంచి వెళ్లిపోతా.. అసెంబ్లీలో రాజాసింగ్

ABN , First Publish Date - 2020-03-16T20:18:16+05:30 IST

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం

తెలంగాణ నుంచి వెళ్లిపోతా.. అసెంబ్లీలో రాజాసింగ్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే.. రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని ప్రకటించారు. ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని..  అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. ఎవరికి అన్యాయం జరుగుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు చేయడం సరికాదని.. ఎన్పీఆర్, ఎఆర్సీ, సీఏఏలపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా అభయమిచ్చినా.. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. మధ్యలో స్పీకర్ మైక్ కట్ చేయడంతో.. తీర్మాన ప్రతులను చించి తన తన నిరసనను తెలియజేశారు. అంతేగాక ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఏకధాటిగా నినాదాలు చేశారు.


మధ్యలో కల్పించుకున్న సీఎం కేసీఆర్.. ‘‘ఇది జరుగుతూనే ఉంటుంది. అన్ని పక్షాలు చెప్పినవి నోట్ చేసుకున్నాను. దయచేసి సీఏఏ వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలి’’ అని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. అనంతరం ఓటింగ్ నిర్వహించిన స్పీకర్.. తీర్మానాన్ని ఆమోదించారు.  

Updated Date - 2020-03-16T20:18:16+05:30 IST