తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

ABN , First Publish Date - 2020-10-13T20:12:51+05:30 IST

తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి.

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నాలుగు చట్టసవరణ బిల్లులకు ఆమోదం లభించింది.


బిల్లులు ఇవే.. 

- జీహెచీఎంసీ చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

- తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

- కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం

- ఇండియన్ స్టాంప్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు అసెంబ్లీలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ.. 10 శాతం బడ్జెట్‌ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ.. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ.. జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్ రెండు పర్యాయాలు కొనసాగిస్తూ నాల్గవ చట్ట సవరణ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా ఐదవ చట్ట సవరణ చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.


అయితే ఇవాళ జరిగిన సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొంత మంది హాజరు కాలేదు. కాంగ్రెస్ నుంచి సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొందేం వీరయ్య, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభకు హాజరు కాలేదు. ఇక బీజేపీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా హాజరు కాలేదు. అధికార పర్టీ సహా, ఎంఐఎం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Updated Date - 2020-10-13T20:12:51+05:30 IST