కరోనా కారణంగా తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ABN , First Publish Date - 2020-09-16T22:21:31+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 7న ప్రారంభ‌మైన స‌మావేశాలు ఇవాళ్టితో ముగిశాయి.

కరోనా కారణంగా తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 7న ప్రారంభ‌మైన స‌మావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు, పోలీసు, శాస‌న‌స‌భ సిబ్బందిలో 13మందికి క‌రోనా సోకింది. ఈ నేప‌థ్యంలో బీఏసీ క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు, అన్ని ప‌క్షాల స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని స్పీక‌ర్ పోచారం తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందాయని ఆయన అన్నారు.

Updated Date - 2020-09-16T22:21:31+05:30 IST