మహిళా, సైబర్‌ భద్రతపై ఈ-లెర్నింగ్‌ కోర్సులు

ABN , First Publish Date - 2020-06-11T08:46:01+05:30 IST

మహిళా, సైబర్‌ భద్రతపై ఈ-లెర్నింగ్‌ కోర్సులు

మహిళా, సైబర్‌ భద్రతపై ఈ-లెర్నింగ్‌ కోర్సులు

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మహిళా, సైబర్‌ భద్రతపై పోలీస్‌ శాఖ ఈ-లెర్నింగ్‌  కోర్సులు నిర్వహిస్తోంది. లైంగిక వేధింపులు, సైబర్‌ నేరా ల్ని ఎలా గుర్తించాలనే దానిపై ఆన్‌లైన్‌లో వివరిస్తారు. ఎవరైనా వేధింపులకు గురైతే ఏ మాత్రం ఆలోచించకుండా షీటీమ్స్‌ను ఆశ్రయించడంతోపాటు ఏదైనా తమ దృష్టికి వచ్చిన అంశంపై 360 డిగ్రీల కోణంలో పరిష్కారాల గురించి  బోధిస్తారు. సైబర్‌ నేరాల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వీలుగా వీడియోలు, ఇతర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రత విభాగం ఈ-లెర్నింగ్‌ తరగతుల్ని ఇటీవలే ప్రారంభించింది. ఆన్‌లైన్‌ కోర్సులో మొత్తం 2200 మంది దరఖాస్తు చేసుకోగా, 2100 మంది కోర్సు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు మహిళా భద్రత విభాగం వెబ్‌సైట్‌లో దరఖాస్తు  చేసుకోవచ్చు.

Updated Date - 2020-06-11T08:46:01+05:30 IST