సంఘాలుగా ఏర్పడితేనే రుణాలు
ABN , First Publish Date - 2020-06-11T08:44:30+05:30 IST
సంఘాలుగా ఏర్పడితేనే రుణాలు

వీధి వ్యాపారులకు కేంద్ర సాయంపై రాష్ట్ర సర్కారు తిరకాసు
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం తో దాదాపు రెండున్నర నెలలుగా వ్యాపారాలు సాగక, ఇబ్బందులకు గురవుతున్న వీధి వ్యాపారులకు పెట్టుబడి రుణ సాయాన్ని అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న నిబంధనలతో వారికి రుణాలు దక్కని పరిస్థితి నెల కొంది. కే ంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని వీధి వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. వీధి వ్యాపారులకు పెట్టుబడి రుణంగా రూ.10 వేలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇందుకోసం రూ.50 వేల కోట్లను కేటాయించింది. కానీ, వీధి వ్యాపారులు సం ఘంగా ఏర్పడితేనే రుణాలు ఇస్తామని రాష్ట్రంలో అధికారు లు చెబుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగా కనీసం పది మంది ఉండేలా వీఽధి వ్యాపారులు సంఘంగా ఏర్పడితే నే.. ఒక్కో వీధి వ్యాపారికి కనీసం రూ.10 వేల వంతున అం దేలా సంఘం పేరిట రుణాలు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు సంఘంగా ఏర్పడడం కష్టమని వీధి వ్యాపారులు చెబుతున్నారు. వీధి వ్యాపారుల చట్టం అమలులో ప్రభుత్వం జాప్యం చేసిందనే విమర్శలున్నాయి. కేంద్రం ఆదేశాల ప్రకారం వీధి వ్యాపారులందరికీ వ్యక్తిగతంగానే రూ.10 వేల పెట్టుబడి రుణ సదుపాయాన్ని కల్పించాలని రాష్ట్ర వీధి వ్యాపారుల సంఘం అ ధ్యక్షుడు ఎస్.వెంకటమోహన్ కోరారు. అలాగే, రాష్ట్ర ప్రభు త్వం కూడా మరో రూ.10 వేలను రుణంగా ఇవ్వాలన్నారు.