రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు
ABN , First Publish Date - 2020-07-19T07:14:54+05:30 IST
ఛత్తీ్‌సగఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే...

హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ద్రోణితో ఆదివారం కొన్నిచోట్ల, సోమవారం చాలాచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.