‘ప్రధానికి భయం పట్టుకుంది’
ABN , First Publish Date - 2020-02-08T21:38:15+05:30 IST
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు గుజరాత్‌తో పాటు యావత్ దేశంలో చర్చకు దారితీస్తున్నాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

సూర్యాపేట: సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు గుజరాత్‌తో పాటు యావత్ దేశంలో చర్చకు దారితీస్తున్నాయని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. దీంతో ప్రధాని మోదీకి భయం పట్టుకుందన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో మూడేండ్లకే రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించగలినప్పుడు ఆరేండ్లు ప్రధానిగా 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేకపోయారన్నారు. ఏ సందర్భం లేకున్నా పార్లమెంట్ ఉభయసభల్లో తెలంగాణ ఇవ్వడమే అన్యాయం అన్న పద్దతిలో మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పడకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిఉండేవారు కాదని.. తనకు ఈ చిక్కులు వచ్చేవి కావని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా ఉందని మంత్రి పేర్కొన్నారు.