7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
ABN , First Publish Date - 2020-08-22T12:52:18+05:30 IST
7 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు
హైదరాబాద్:రాష్ట్ర శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 7న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ తమిళిసై శుక్రవారం ఉభయ సభల ప్రారంభ ఉత్తర్వులను జారీ చేశారు. 20 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కీలక అంశాలపై సమగ్రంగా చర్చలు జరిపేలా కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలని సీఎం ఆదేశించారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేలా సమావేశాలను నిర్వహిస్తారు.