తెలంగాణ జన్ సంవాద్ వర్చువల్ ర్యాలీ 20కి వాయిదా
ABN , First Publish Date - 2020-06-18T10:06:20+05:30 IST
బీజేపీ రాష్ట్ర శాఖ రేపు (శుక్రవారం) నిర్వహించాల్సిన తెలంగాణ జన్ సంవాద్ వర్చువల్

హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర శాఖ రేపు (శుక్రవారం) నిర్వహించాల్సిన తెలంగాణ జన్ సంవాద్ వర్చువల్ ర్యాలీ శనివారం (20వ తేదీ) సాయంత్రం 4.30 గంటలకు వాయిదా పడిందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పాలన విజయవంతమైన సందర్భంగా చేపట్టిన ఈ వర్చువల్ ర్యాలీకి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.