శ్రీశైలం పవర్‌హౌ్‌సను పరిశీలించిన కమిటీ

ABN , First Publish Date - 2020-09-25T07:18:18+05:30 IST

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్కేంద్రంలో జరిగిన దుర్ఘటనపై టెక్నికల్‌ కమిటీ సమగ్ర అధ్యయనాన్ని మొదలుపెట్టింది...

శ్రీశైలం పవర్‌హౌ్‌సను పరిశీలించిన కమిటీ

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్కేంద్రంలో జరిగిన దుర్ఘటనపై టెక్నికల్‌ కమిటీ సమగ్ర అధ్యయనాన్ని మొదలుపెట్టింది. ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించగా జెన్‌కో.. టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీరఘుమా రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిటీలో ఇద్దరికి కరోనా సోకడంతో అధ్యయనం ముందుకు సాగలేదు. ప్రస్తుతం వారు కోలుకోవడంతో బుధవారం నుంచి సాంకేతికపరమైన అంశాలకు సంబంధించిన రికార్డులను సేకరించే పనిలో పడ్డారు.


గురువారం కూడా కమిటీ పరిశీలన జరిపింది. కాగా, పవర్‌హౌ్‌సలో మంటలు వ్యాపించిన ఘటన తర్వాత  150 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యం గల 6 యూనిట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెన్‌కో సిబ్బంది 1, 2 యూనిట్లను ఉత్పత్తికి సిద్ధం చేశారు. ఇవి 300 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై జెన్‌కో అధికారులు రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నారు. 

Updated Date - 2020-09-25T07:18:18+05:30 IST