17న టీచర్ల సామూహిక నిరాహార దీక్షలు
ABN , First Publish Date - 2020-12-15T08:10:01+05:30 IST
సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 17న ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నారని ఉపాధ్యాయ

సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 17న ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నారని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి(యూఎస్పీసీ) తెలిపింది. సోమవారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని పోరాట కార్యక్రమం గోడపత్రాలు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు సదానందంగౌడ్, జంగయ్య, రమణ, కృష్ణుడు, చావ రవి మాట్లాడుతూ.. వెంటనే ఉపాధ్యాయులకు పదోన్నతులు, సాధారణ, అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.