ఉపాధ్యాయుల కోసం ఈ-క్లాైస్ రూమ్
ABN , First Publish Date - 2020-08-16T10:24:19+05:30 IST
ఆన్‌లైన్ తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను నివారించేందుకు ‘దీక్షక్’ అనే సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ ..

- ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకుల అభివృద్ధి
కోల్‌కతా, ఆగస్టు 15: ఆన్‌లైన్ తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను నివారించేందుకు ‘దీక్షక్’ అనే సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసింది. ఎలకా్ట్రనిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ రాజా దత్తా, తమ విద్యార్థులతో కలిసి దీన్ని తయారు చేశారు. విద్యాసంస్థ క్యాంపస్ నెట్‌వర్క్‌లోనే దీక్షక్‌ను వినియోగించకోవచ్చని రాజా తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఒకే సెషన్ నడుస్తుందని, లైవ్ చాట్ బాక్స్‌లో విద్యార్థులు సందేహాలను పంపవచ్చని వివరించారు. క్లాస్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఎలాగైతే విద్యార్థులు చేయి ఎత్తి సందేహాలు నివృత్తి చేసుకుంటారో అదే తరహాలో దీక్షక్‌లోనూ ఏర్పాటు ఉందన్నారు. ‘‘ఉపాధ్యాయులు డాక్యుమెంట్లను విద్యార్థులతో పంచుకోవచ్చు. నోట్స్ అప్‌డేట్ చేయవచ్చు. దీక్షక్ చాలా తక్కువగా నెట్‌ను స్వీకరిస్తుంది. సెల్‌ఫోన్‌తో కూడా వాడుకోవచ్చు. విద్యార్థుల హాజరు ఉపాధ్యాయులకు తెలుస్తుంది. ఐఐటీలో 40 గంటల పాటు 300 మందికి తరగతులు నిర్వహించి పరీక్షించాం. దీక్షక్ కాపీరైట్లకు దరఖాస్తు చేశాం. నిర్వహణకు మంచి స్టార్ట్‌పను చూస్తున్నాం. మరింత అభివృద్ధి చేసి, కొత్త ఫీచర్లను ప్రవేశపెడతాం’’ అని రాజా తెలిపారు.